Zebra

Zebra: సత్యదేవ్ ఆశలపై నీళ్ళు చల్లిన ‘జీబ్రా’!

Zebra: ప్రతి సినిమాకూ హీరోలు ఒకే తీరున కష్టపడతారు. అయితే కొన్ని సినిమాలు పే చేస్తాయి. మరికొన్ని నిరాశ కలిగిస్తాయి. గత కొంతకాలంగా ఎంత కష్టపడినా… సత్యదేవ్ కు సక్సెస్ దక్కడంలేదు. దాంతో పాన్ ఇండియా మూవీ ‘జిబ్రా’ మీద ఆశలు పెట్టుకున్నాడు. భారీ స్థాయిలో ప్రచారం చేసినా… ఈ సినిమా ఒక వర్గాన్నే మెప్పించగలిగింది. దాంతో మరోసారి సత్యదేవ్ నిరాశకు గురి కాకతప్పలేదు. మూవీ కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయని పబ్లిసిటీ చేస్తున్నా, పట్టణ, గ్రామీణ ప్రాంతంలోని ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం ఎక్కలేదని అంటున్నారు. హైదరాబాద్ లాంటి ఒకటి రెండు సిటీస్ లోనే ఓ మాదిరి కలెక్షన్స్ ఉన్నాయని టాక్! ‘ఓటీటీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని థియేటర్లలో హిట్ అయితే ఓటీటీలో తప్పకుండా డిమాండ్ ఉంటుంద’ని సత్యదేవ్ అభిప్రాయపడుతున్నాడు. కానీ థియేటర్లలో ‘జిబ్రా’కు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kalki 2: మొదలైన 'కల్కి -2' ప్రీ ప్రొడక్షన్ వర్క్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *