Zakary Foulkes: న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్ జాకరీ ఫౌల్కెస్ ఇటీవల జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసి ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనిబరిచాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (9/75) సాధించి, న్యూజిలాండ్ తరపున టెస్ట్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఈ ప్రదర్శనతో అతను గతంలో విల్ ఓరూర్క్ (9/93) పేరు మీద ఉన్న రికార్డును అధిగమించారు.
ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు: తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో 5/37 గణాంకాలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్, 359 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మూడవ అతిపెద్ద విజయం కావడం విశేషం. జాకరీ ఫౌల్కెస్ ఈ విజయంలో తన అద్భుతమైన ప్రదర్శనతో కీలక పాత్ర పోషించారు. ఈ రికార్డుతో అతను భవిష్యత్తులో న్యూజిలాండ్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదగగలడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ జింబాబ్వేపై 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.