YVS Chowdary

YVS Chowdary: దీపావళికి ముందే సబ్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

yvs chowdary: నందమూరి నాలుగో తరం వారసుడు, నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు అయిన నందమూరి తారకరామారావును హీరోగా పరిచయం చేస్తున్నాడు వైవియస్ చౌదరి. అయితే ఇప్పటి వరకూ తనని మీడియా ముందుకు తీసుకురాలేదు. హీరోయిన్ ను పరిచయం చేసిన వైవియస్ ఇప్పుడు సబ్ జూనియర్ ఎన్టీఆర్ ను దీపావళికి ముందే అక్టోబర్ 30న పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాడు. కొత్తవారిని పరిచయం చేస్తూ వారిని స్టార్స్ గా మలచటంలో వైవియస్ ది అందెవేసిన చేయి. వైవియస్ పరిచయం చేసిన వెంకట్, ఆదిత్య ఓం, సాయిధరమ్ తేజ్, రామ్ వంటి వారు ఆ తర్వాత స్టార్స్ గా రాణించారు. ఇప్పుడు నందమూరి నాలుగవతరం వంతు వచ్చింది. మరి ఈ సినిమా కోసం వైవియస్ లవ్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడా? లేక యాక్షన్ ఎంటర్ టైనర్ అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఇటీవల కాలంలో వైవియస్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ‘రేయ్’ తర్వాత సినిమా చేయలేదు. అయితే ఈ మూవీ కోసం కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా వంటి ఉద్దండులు పని చేస్తుండటంతో ప్రాజెక్ట్ పై హైప్ ఏర్పడింది. మరి సబ్ జూనియర్ ఎన్టీఆర్ తన లుక్ తో ఏ మేరకు ఆకట్టుకుంటాడో తెలియాలంవటే 30 తేదీ వరకూ ఆగక తప్పదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Whatsapp New Feature: వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చే కొత్త ఫీచర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *