PISINAARI REDDY PARTY

PISINAARI REDDY PARTY: అసలే ఆర్థికంగా అంతంత మాత్రమే!

PISINAARI REDDY PARTY: ఏ పార్టీకి అయినా ఆవిర్భావదినోత్సవం అంటే పండుగ లాంటిది. కానీ వైసీపీలో సంస్కృతి అందుకు డిఫరెంట్‌గా కనబడుతోంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కానీ ఎక్కడా పార్టీలో ఆ జోష్‌ లేదు. కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. అధికారం నుండి దిగిపోయి ఏడాది కాలేదు. కానీ రేపు ఎన్నికలు నిర్వహించినా జగన్‌ సీఎం అవుతాడంటూ ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో ఎలివేషన్లు ఇస్తున్నారు. అలాంటి వారిలో జోష్‌ నింపడానికైనా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక వేదికగా చేస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ఏర్పాట్లేవీ కనిపించడం లేదు. ఇంతకీ వైసీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించక పోవడానికి కారణం ఏంటి? లెట్స్‌ వాచ్‌ దిస్ స్టోరీ.

వైసీపీకి నడుస్తోన్నది గడ్డుకాలం. ప్రజలు ఇచ్చిన షాక్ కంటే.. జగన్ రెడ్డి ఇస్తున్న షాకులే ఆ పార్టీకి.. క్యాడర్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. ఇలా చెబుతుండటానికి కారణం, నేపథ్యం రేపు ఆ పార్టీ ఆవిర్భావదినోత్సవం కావడమే. జగన్‌ని నాయకుడిగా ఆధారించేవారు వైసీపీ అన్నా, ఆ పార్టీ జెండా అన్నా అమితంగా అభిమానిస్తుంటారు. కానీ ఆ ఇష్టం, అభిమానం జగన్‌లో మాత్రం కనిపించదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడూ అంతే. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్దగా ప్రియార్టీ ఇవ్వలేదు. తల్లిని పార్టీ గౌరవాధ్యక్షరాలి పదవి నుంచి తీసేయాలనుకున్నప్పుడు.. తనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించాలనుకున్నప్పుడు ఓ ప్లీనరీ పెట్టి.. పని కానించేశారు. కానీ పార్టీ ఆవిర్బావ దినోత్సవానికి ప్రాముఖ్యత ఇచ్చింది లేదు. అయితే ఊరూ వాడా సంబరాలు బాగానే జరిపేవాళ్లు పార్టీ నేతలు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతాం అనే విధంగా ఉండేది అప్పట్లో ఆ పార్టీ నేతల తీరు. ఇప్పుడు సమస్యంతా ఇక్కడే వస్తోంది. ఆ పార్టీకి ఉన్నదే 11 మంది ప్రతినిధులు. వారిలో చాలా మంది అసలు పార్టీలో ఉన్నారా లేదా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పైగా అధికారంలో లేనప్పుడు.. ఓటమిపాలైన నేతలు డబ్బులు ఖర్చుపెట్టుకునేందుకు ముందుకొస్తారో లేదో సందేహమే.

రేపే వైసీపీ ఆవిర్భావ దినం. వైసీపీ అధికారం నుంచి దిగింది, కూటమి అధికారం చేపట్టింది పట్టుమని 10 నెలలు. కానీ ఓ రకం వైసీపీ శ్రేణులు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్‌ 151 సీట్ల రికార్డును బద్దలు కొట్టి మరీ ముఖ్యమంత్రి అవుతారని గట్టిగా వాదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆ తరహా ఎలివేషన్‌ వీడియోలను కుప్పలు తెప్పలుగా తయారు చేసి వదులుతుండటంతో జగన్‌ ఫ్యాన్స్‌ అంతా అదే నిజం అనుకుని ఒక విధమైన ట్రాన్స్‌లో ఉన్నారు. ఎలాగో అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి.. ధూం ధాంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని, రాష్ట్రాన్ని షేక్‌ చేసేలా గట్టిగా కార్యక్రమాలు చేయాలని వారంతా కోరుకుంటున్నారు. కానీ జగన్‌ మాత్రం.. మీ మీ పార్టీ కార్యాలయాల్లో మీరే జెండా ఎగరేసుకోండి… సోషల్‌మీడియాలో రచ్చ కంటిన్యూ చేయండని సలహాలిచ్చి ఊరుకున్నట్లున్నారు.

Also Read: MWC 2025: సూర్యకాంతితో ఛార్జ్ అయ్యే ల్యాప్‌టాప్ – లెనోవా Yoga Solar PC

PISINAARI REDDY PARTY: వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించకపోవడానికి మరో కారణం చెప్తున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. జగన్‌ది విచిత్రమైన మెంటాలిటీ. ఆయనకు ఎన్ని ఆస్తులున్నా.. చిన్నా చితకా ఖర్చులకు కూడా జంకుతారట. పార్టీ కార్యకర్తలకు కానీ, సాయం కోసం వచ్చే ప్రజలకు కానీ ఆయన జేబు నుండి చిల్లి గవ్వ తీయరని ఆ పార్టీలోనే చెప్పుకుంటూ ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరికైనా హామీలివ్వాల్సి వచ్చినా మన ప్రభుత్వం వచ్చాక చేద్దాంలే అంటుంటారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ని ఆహ్వానించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపాలంటే భారీగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే జగన్‌ ఆ ఈవెంట్‌కు పెద్దగా ప్రియార్టీ ఇవ్వరని చెప్తున్నారు.

ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరో విషయం ఇక్కడ గమనించాలి. వైసీపీ నేతలు పలువురు జైళ్ల బాట పడుతున్న సంగతి తెలిసిందే. వారందరికీ లీగల్‌ అసిస్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌ మోహన్‌రెడ్డిపైనా, ఆయన పార్టీపైనా ఉంది. కానీ అరెస్ట్‌ అవుతున్న వారందరికీ లాయర్లను ఏర్పాటు చేస్తే.. ఆ ఖర్చు పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్లే అందరికీ ఒకే లాయర్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని పంపుతున్నారంటూ వైసీపీ నేతలే వాపోతున్నారు. పొన్నవోలు అయితే బిల్లు చెల్లించనక్కర్లేదు. అధికారంలోకి వచ్చాక ఏదో ఒక పదవి ఇస్తే సరిపోతుందన్న భావన జగన్‌మోహన్‌ రెడ్డిది అని పలువురు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్న పరిస్థితి.

ఓ వైపు జనసేన పార్టీని కించ పరుస్తున్న వైసీపీ.. ఇప్పుడు తన ఆవిర్భావాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో లేదు. కానీ జనసేన పార్టీ మాత్రం ధూం.. ధాంగా ఆవిర్భావ సభను పిఠాపురంలో నిర్వహిస్తోంది. అంటే.. తమకన్నా ఎదిగిపోతున్న పార్టీని కించపరిచి మానసిక ఆనందం పొందుతున్నారు కానీ.. తమను దాటిపోతున్న పార్టీని.. తాము దాటాలంటే ఏం చేయాలో మాత్రం ఆలోచించడం లేదు. ఎదుటి వారిని కించపరిస్తే తాము ఎదిగిపోతామనుకునే భావజాలం ఉన్న పార్టీ ఎదుగుతుందా.. పాతాళానికి పడిపోతుందా? అనేది వారే ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *