Ys Sharmila: జగన్ ఓ తోలుబొమ్మ షర్మిల షాకింగ్ కామెంట్స్..

Ys Sharmila: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

అమిత్‌ షా వ్యాఖ్యలు – ఊసరవెల్లి సామెత

అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఊసరవెల్లి తీరుగా ఉటంకించిన షర్మిల, వైసీపీ పాలనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. “వైసీపీ పాలన ఒక విపత్తు అని మీరు అంటున్నారు. ఐదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేశారు?” అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఆగిపోతుంటే, కేంద్రం ఏమీ చేయలేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు ఉన్నప్పటికీ అమిత్‌ షా స్పందించలేదని మండిపడ్డారు.

అవినీతి, అప్పులు, హత్యకేసు – ప్రశ్నల వర్షం

వైఎస్‌ షర్మిల మరో అడుగు ముందుకేసి, జగన్‌ సొంత బాబాయి హత్య కేసులో కేంద్రం మౌనం వీడలేదని విమర్శించారు. “రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే, మీకు ఏమాత్రం అనుమానం రాలేదా? వైసీపీలో భారీ అవినీతి జరిగితే, ఒక్క విషయం అయినా బయటపెట్టారా?” అని షర్మిల నిలదీశారు.

“వైసీపీపై కేంద్రం ఆటల డిజైన్‌”

అమిత్‌ షా మరియు బీజేపీ వైసీపీని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుందని, జగన్‌ను దత్తపుత్రుడిగా చూసినట్లు వ్యవహరించారని షర్మిల ఆరోపించారు. “పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు తెలిపే రబ్బర్‌ స్టాంప్‌ లాగా వైసీపీని ఉపయోగించారు. రాష్ట్ర సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు బీజేపీ దోహదం చేసింది,” అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

విభజన హామీలు, కేంద్రం నైతిక బాధ్యత

2019-2024 మధ్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి జగన్ కర్త అయితే, ఆ విధ్వంసానికి బీజేపీ కర్మ, క్రియలతో పాలుపంచుకుందని షర్మిల అన్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా, ఆర్థిక సహాయం పేరుతో ప్రజలను మోసం చేయడమే బీజేపీ ప్రాధాన్యత అని విమర్శించారు.

సీబీఐ విచారణ డిమాండ్

గత ఐదేళ్ల వైసీపీ పాలనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించే ధైర్యం బీజేపీకి ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. “మీరు నిజాయితీతో ఉంటే వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి,” అని అమిత్‌ షా కు సవాల్‌ విసిరారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AB-PMJAY: వృద్ధులకు ప్రధాని మోదీ కానుక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *