YS SHARMILA : మహా న్యూస్‌పై దాడి హేయకృత్యం

YS SHARMILA : మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ గుంపుల దాడిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థలపై భౌతిక దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. శనివారం ఆమె ఈ దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్న మహా న్యూస్ ఛానల్‌పై బీఆర్‌ఎస్ గూండాలు దాడికి దిగడం దారుణం. మహిళా జర్నలిస్టులపై కూడా దాడి చేసిన తీరును ఏ విధంగానూ క్షమించలేం,” అని షర్మిల విమర్శించారు. “ఇలాంటి దాడులు మీడియా స్వేచ్ఛపై కక్షసాధింపు చర్యలు. ఇవి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలుగా గుర్తించాలి,” అని ఆమె అన్నారు.

తనపై కూడా ట్యాపింగ్ జరిగిందని షర్మిల ఆరోపించారు. “నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఆ ట్యాప్ చేసిన ఆడియోను నాకు వినిపించారు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే, దాడులకు దిగడమేంటి?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఫోన్ ట్యాపింగ్‌ చేసిన నిజాలు బయట పడుతుంటే, సిట్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే, ఆ దొంగలకూ భయమొస్తోంది. దొంగ చెవులు బయట పడుతున్నాయనే భయంతో, వాస్తవాలను చూపించే వారిపై దాడులకు దిగుతున్నారు. మీడియాను భయపెట్టి మూయించాలనే కుట్ర ఇది,” అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Aamir Khan: ఆమీర్‌ ఖాన్‌ సినిమాకు దారుణాతి దారుణమైన రెస్పాన్స్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *