YS Jagan Mohan Reddy:ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. గత 14 ఏండ్లుగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. 2009, 2010 నుంచి ఈ కేసు కొనసగుతున్నది.
YS Jagan Mohan Reddy:జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన 800 కోట్ల విలువైన భూములు, షేర్లను జప్తూ చేస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఇదే కేసును సీబీఐ కూడా విచారిస్తున్నది. అయితే ఈడీ నిర్ణయంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడనున్నది.
YS Jagan Mohan Reddy:జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కంపెనీలకు లాభాలు కలిగిస్తే, ఫలితంగా దానికి బదులుగా వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీలలో ఉన్న షేర్లను ఈడీ అటాచ్ చేసినట్టు తెలిసింది. ఈ ఆస్తులు జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా కంటే ఆయన కుటుంబం, దగ్గరి కంపెనీలు, సహచరుల పేరిట ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
YS Jagan Mohan Reddy:అవినీతి కేసులో ఏ1గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి చర్లపల్లి జైలులో ఆయన 16 నెలలపాటు శిక్షను అనుభవించారు. తాజాగా మళ్లీ ఆ కేసులపై ఈడీ దూకుడు పెంచడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

