YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
“పేదల సొంతింటి కలలను నాశనం చేస్తారా?”
‘చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువు అయ్యింది’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘పేదల సొంతింటి కలలను నాశనం చేయడానికా మీ ప్రభుత్వం? పథకాలు అందించే ప్రభుత్వం కాదు మీది.. రద్దు చేసే ప్రభుత్వం మీది’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
‘పేదలకు అండగా నిలబడాల్సింది పోయి.. ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా?’ అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2025