YS Jagan: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సమయంలో జరిగిన విషాద ఘటనపై తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యకర్త సింగయ్య మృతిపై సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సింగయ్యను ఢీకొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
ముందుగా ఇది జగన్ కాన్వాయ్‌లోని వేరే వాహనం కారణంగా జరిగినదని అని అందరూ అనుకున్నారు. అయితే, తాజాగా వచ్చిన వీడియో ఫుటేజ్ ప్రకారం జగన్ ఉన్న కారు టైర్ కింద సింగయ్య పడిపోయి నలిగిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Chennai: సాఫ్ట్‌వేర్ యువతిపై డెలివరీ బాయ్ లైంగికదాడికి యత్నం
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోని వీడియోలు పరిశీలించి, అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన వీడియోలో జగన్ వాహనంపై నించొని అక్కడికి వచ్చిన అభిమానులతోనే అభివాదం చేస్తుండగా, కింద కార్యకర్త (సింగయ్య) కారు టైర్ల కింద పడిపోవడం కనిపించింది. స్థానికులు కేకలు వేసినా… వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్టు మరో కోణంలో వీడియోలు చెబుతున్నాయి.
ఈ వీడియోలు బయటకు రాగానే నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోతే కనీసం జగన్ స్పందించకపోవడం దారుణం”, అని పలువురు విమర్శలు చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారికి శిక్ష వేయాలని, ముఖ్యంగా జగన్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్న పిచ్చి అభిమానం pic.twitter.com/mHFN7JPWMl
— s5news (@shekhar26778281) June 22, 2025