YS jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రజలు “జగన్ 2.O” ను చూడబోతున్నారని, ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని స్పష్టం చేశారు.
కార్యకర్తల భవిష్యత్తుపై స్పష్టత:
జగన్ మాట్లాడుతూ, గతంలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని అంగీకరించారు. అయితే, ఈసారి కార్యకర్తల కోసం ఏం చేయగలమో చూపిస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
అక్రమ కేసులపై ప్రతిస్పందన:
కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టినవారిపై ప్రైవేట్ కేసులు వేసి, చట్టం ముందు నిలబెడతా అని జగన్ ఘాటుగా హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలతో, రాజకీయ పరంగా జగన్ 2.O ఎలా ఉండబోతుందో, పార్టీలో ఆయన ఏ మార్పులు చేయబోతున్నారో అనే దానిపై స్పష్టత లేదు.