Youtube Ceo: సోషల్ మీడియా ఇప్పుడు ఇది ప్రతిఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాని తమ డైలీ లైఫ్ లో వాడుతారు. ఒత్తిడిగా అనిపించినా, ఫ్రెండ్స్‌తో మాట్లాడలన్న ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకోవాలన్న ఇంస్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్ చాట్, వంటి యాప్స్‌లో యువత ఎక్కువ సేపు ఉంటున్నారు. చిన్న పిల్లలు కూడా యువతతో సమానంగా సోషల్ మీడియాని వాడుతున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి, సోషల్ మీడియాకి బానిసలుగా మారుతున్న పిల్లల గురించి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు గురించి మాట్లాడారు.
సోషల్ మీడియాని ఎక్కువగా వడటం మంచిది కాదు అంటున్నారు.. అందులోను చిన్న పిల్లలు ఎక్కువగా వాడకూడదు అందుకే తన పిల్లలను సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతాము అని తెలిపారు. వారంలో ఒక్క రోజు మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తాం అని చెప్పారు. ఈ విషయంలో తాను తన భార్య కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు.
పిల్లలు సోషల్ మీడియాలో ఏంచేస్తున్నారు వాటిని ఎందుకోసం ఉపయోగిస్తున్నారనే విషయాని తెలుసుకోవడం పేరెంట్స్‌గా మనబాధత్య అని అన్నారు, సోషల్ మీడియాలో నైతిక విలువలు నేర్చుకోవడానికి వాడాలి.. కాని ఇపుడు అందరూ ట్రెండ్‌లో ఉండడానికి ,ఫేమస్ కావడానికి ఏవిపడితే అవే చేస్తున్నారు దానివల్ల పిల్లలు చెడిపోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసమే పిల్లల కోసం యూట్యూబ్ కిడ్స్ యాప్‌ను 2015లో తాము రూపొందించినట్లు తెలిపారు కాగా నీల్ మోహన్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

