YouTube Shorts AI Remix: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గూగుల్ ఒక అద్భుతమైన వార్త చెప్పింది. వీడియో ఎడిటింగ్‌ను మరింత సులభతరం చేస్తూ ‘AI Remix’ అనే సరికొత్త ఫీచర్‌ను టెస్టింగ్ ఫేజ్‌లో విడుదల చేసింది.ఈ ఫీచర్ ని ముందుగా ఇంగ్లీష్ స్పీకింగ్ యూట్యూబ్ చానెల్స్ కి అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల క్రియేటర్లు ఇతర ఎడిటింగ్ యాప్‌ల అవసరం లేకుండానే, యూట్యూబ్ యాప్‌లోనే తమ లాంగ్ వీడియోల నుండి షార్ట్ వీడియోలను తయారుచేసుకోవొచ్చు. ముఖ్యంగా క్రియేటివిటీని పెంచేందుకు ఇందులో రెండు ప్రధాన టూల్స్ అందుబాటులోకి రానున్నాయి.
1. ‘Add Object’ (యాడ్ ఆబ్జెక్ట్) టూల్
ఈ ఫీచర్ క్రియేటర్ల ఊహలకు ప్రాణం పోస్తుంది. మీకు కావాల్సిన వస్తువును వీడియోలో చేర్చాలనుకుంటే, కేవలం ఒక ప్రాంప్ట్ (Prompt) రాస్తే సరిపోతుంది. ఉదాహరణకు, ఒక ఖాళీ టేబుల్‌పై ‘ఒక కప్పు కాఫీ’ ఉండాలని మీరు ప్రాంప్ట్ ఇస్తే, ఏఐ ఆ వీడియో ని క్రెయతె చేస్తుంది. దాని మనకి కావలిసిన ప్లేసులో యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఆదికూడా ఏఐ చేసేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం 8 సెకన్ల నిడివి ఉన్న వీడియో క్లిప్పుల పైనే పనిచేస్తుంది.
2. ‘Reimagine’ (రీఇమేజిన్) టూల్
ఈ టూల్ సహాయంతో ఏదైనా ఒక షార్ట్ వీడియోలోని ఒక ఫ్రేమ్‌ను ఆధారం చేసుకుని, దాన్ని పూర్తిగా కొత్త వీడియోలాగా మార్చవచ్చు.
మీరు ఒక ప్రాంప్ట్ ఇంకా రెండు రిఫరెన్స్ ఇమేజెస్ (Reference Images) ఇస్తే, వాటిని ఉపయోగించుకుని ఏఐ ఒక సరికొత్త వీడియోను క్రియేట్ చేస్తుంది. ఇది క్రియేటర్లకు తమ కంటెంట్‌ను విభిన్న కోణాల్లో ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది.
క్రెడిట్ మరియు నియంత్రణ (Transparency & Control)
ఏఐ కంటెంట్ విషయంలో యూట్యూబ్ పారదర్శకతకు పెద్దపీట వేసింది.
- లింకింగ్: ఏఐ రీమిక్స్ ద్వారా తయారైన ప్రతి వీడియో, దాని ఒరిజినల్ వీడియోతో లింక్ అయి ఉంటుంది. దీనివల్ల అసలైన క్రియేటర్‌కు రావాల్సిన గుర్తింపు (Credit) మరియు వ్యూస్ లభిస్తాయి.
- ఆప్ట్-అవుట్ ఆప్షన్: ఒకవేళ క్రియేటర్లు తమ వీడియోలను ఇతరులు ఏఐ రీమిక్స్ చేయడానికి ఇష్టపడకపోతే, సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ను ఆఫ్ (Off) చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్లు కొంతమంది ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
