Godari Gattupain: ‘మేమ్ ఫేమస్’తో యూత్ హీరోగా మారిన సుమంత్ ప్రభాస్ మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘గోదారి గట్టుపైన’ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. గోదావరి పరిసరాల పల్లెటూరి వైబ్స్‌తో సాగే ఈ టీజర్ స్నేహితుల కథ చుట్టూ తిరుగుతుంది.
Also Read: Dasari Narayana Rao: ఈ స్టార్ హీరోయిన్ దాసరి మనవరాలా?
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘గోదారి గట్టుపైన’ చిత్రాన్ని కొత్త దర్శకుడు సుభాష్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం గోదావరి నది పరివాహక ప్రాంతంలో సాగే ఈ టీజర్, పల్లెటూరు రుచులతో నిండి ఉంది. స్నేహితుల చుట్టూ కథ ఆవిష్కృతమవుతుంది. సుమంత్ ప్రభాస్ యూత్‌ను మెప్పించేలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ నిధి ప్రదీప్ గ్లామర్‌గా ఆకట్టుకుంటోంది. కలర్‌ఫుల్ విజువల్స్, ఉల్లాసభరితమైన సన్నివేశాలతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. కామెడీ, రొమాన్స్, భావోద్వేగాలు సమపాలలో మేళవించారు. జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నాగవంశీ సంగీతం అందిస్తుండగా, అభినవ్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా, రిలీజ్ అయ్యాకా, యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
