UP:ఒక మనిషి చనిపోతే అంతిమయాత్ర క్రతువులా నిర్వహిస్తారు. తొలుత గడ్డిలో వేస్తారు, దింపుడుకల్లం వద్ద సంతానంతో చెవుల వద్ద చివరి పిలుపు ఇవ్వాలంటారు. ఎందుకంటే చివరాఖరికి చనిపోయి ఉండకుంటే లేచి వస్తాడో ఏమోననే ఆశతోనే పూర్వం నుంచి పెద్దలు ఇలాంటి ఆచారం చేస్తూ ఉంటారు. అది ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. ఇది ఇలాంటిది కాకున్నా, చనిపోయాడనుకున్న మనిషిని పోస్టుమార్టం చేయబోతుంటే బతికే ఉన్నానంటూ లేచి కూర్చున్నాడు. ఈ విషయమే తెలుసుకుందాం.. రండి
UP:ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ సమీపంలోని గోట్కా గ్రామానికి చెందిన షగుణ్ శర్మ తన సోదరుడితో కలిసి ఓ బైక్‌పై వెళ్తుండగా మరో బైక్ ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షగుణ్ శర్మ తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించడంతో మీరట్‌లోని మెడికల్ కళాశాలకు తరలించారు. అతడు మూడు రోజులు అక్కడే చికిత్స పొందాడు. శనివారం మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
UP:ఆదివారం షగుణ్ శర్మకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు రెడీ అయ్యారు. స్ట్రెచర్‌పై షగుణ్ శర్మ బాడీని తీసుకెళ్తుండగా, ఒక్కసారిగా చలనం వచ్చింది. స్ట్రెచర్ నెట్టే వ్యక్తులు తేరుకునేలోగా ఒక్కసారిగా షాక్.. చనిపోయాడనుకున్న షగుణ్ శర్మ స్ట్రెచర్‌లో లేచి కూర్చున్నాడు. సార్ నేను బతికే ఉన్నా.. అని షగుణ్ శర్మ కేకలు వేయడంతో పక్కనే ఉన్న వైద్యులు షాక్ అయ్యారు.
UP:వెంటనే షగుణ్ శర్మను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందించడం ప్రారంభించారు. ఈ ఘటనపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించారు. కుటుంబ సభ్యులు షగుణ్ శర్మను కాపాడుకునే పనిలో పడ్డారు. ఒకవైళ షగుణ్ శర్మ బాడీకి పోస్టుమార్టం చేసి ఉంటే ఉన్న ఆ కొన ఊపిరి కూడా పోయేదన్న మాట. చూశారా.. ఆఖరి మజిలీ అంటారుగా, ఇలాంటిదేనన్న మాట.
UP:దేవుడే దిగి వచ్చి మావాడి ప్రాణాలు కాపాడాడని షగుణ్ శర్మ కుటుంబ సభ్యులు మొక్కుతున్నారు. షగుణ్ శర్మలో ఊపిరి ఉన్నదనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయామా? అని వైద్యులు మదన పడుతున్నారు. ఏదైతేనేమి కానీ, పోయిందనుకున్న ప్రాణం తిరిగొచ్చింది.

