Venky-Trivikram: సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో జతకట్టనున్నాడు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం కోసం ఇప్పటికే జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ఫుల్‌ఫిల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అందాల తార రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఈ పాత్రకు సరైన ఎంపిక అని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Tollywood: థియేటర్ల బంద్ ఉండదు.. కానీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఎలా?
దీంతో వెంకటేష్ సరసన రుక్మిణి నటించనున్నట్లు చిత్ర బృందం ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.