YCP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీలో కట్టుతప్పే వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా ఈ ఘటనతో తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలను ఆ పార్టీ సస్పెండ్ చేస్తూ గురువారం (జూలై 17) ఆదేశాలు జారీ చేసింది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేయడం గమనార్హం.
YCP: హిందూపురం నియోజకవర్గంలో ఇద్దరు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జగన్ స్పందించారు. నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు వైసీపీలో తొలి నాళ్ల నుంచి కొనసాగుతుండటం గమనార్హం.
YCP: వైసీపీ ఆవిర్భావ సమయంలో హిందూపురం నియోజకవర్గం తొలి వైసీపీ ఇన్‌చార్జిగా వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేయగా, 2024లో అదే బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా దీపిక పోటీ చేసి ఓడిపోయారు. దీపిక పోటీ సమయంలో వేణుగోపాల్‌రెడ్డి, నవీన్ నిశ్చల్ మద్దతుగా నిలిచారు.
YCP: అయితే తాజాగా ఓ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2029 ఎన్నికల్లో వైసీపీ టికెట్ తనకే వస్తుందని నవీన్ నిశ్చల్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న దీపిక వీరిద్దరిపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్‌రెడ్డిపై వైసీపీ వేటు వేసింది.