Varra Ravindrareddy: వైకాపా సోషల్ మీడియా కార్యకర్త పులివెందుల కు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కడప తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైనా, తెలుగుదేశం నేతల పైన వర్రా రవీంద్ర రెడ్డి ఇష్టానుసారంగా సోషల్ మీడియా లో పోస్టులు పెట్టేవారు.ప్రస్తుత హోం మంత్రి అనిత పైన వర్రా రవీంద్ర రెచ్చిపోయి అసభ్యంగా పోస్టులు పెట్టడం అప్పట్లో అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.గత ప్రభుత్వం లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.వైయస్ షర్మిల,సునీత పైన అసభ్యంగా పోస్టులు పెట్టడంతో వర్రా రవీంద్ర రెడ్డి పై పులివెందుల,మంగలగిర,కడప పోలీసు స్టేషన్ లలో పలు కేసులు నమోదు అయ్యాయి.ఆ కేసు ల్లో వర్రా రవీంద్ర రెడ్డి ని కడప తాలూక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
