Yash: రాకింగ్ స్టార్ యష్ మరోసారి సినీ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’లో ఆయన రావణుడి పాత్రను పోషించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. యష్ మాట్లాడుతూ, రావణుడి పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయని, భావోద్వేగాలు, శక్తి, ఆధిపత్యం, మేధస్సు వంటి విభిన్న కోణాలను ప్రదర్శించేందుకు ఈ పాత్రకు మంచి అవకాశముందని తెలిపారు. ఇతర పాత్రల కోసం వచ్చిన ఆఫర్లను తిరస్కరించి, రావణుడిగా మాత్రమే నటించాలని తాను ముందుగానే నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక సీక్రెట్ ఎంగేజ్మెంట్
‘రామాయణం’ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా యష్ రావణుడిగా కనిపించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యష్, ఈసారి ప్రతినాయకుడి రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. ఈ పాత్ర ద్వారా తన నటనా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. సినీ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని సాహసోపేతంగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో యష్ మరొకసారి తన ప్రతిభను నిరూపించనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.