Kothalavadi: కన్నడ సూపర్‌స్టార్ యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ సినీ రంగంలోకి ఘనంగా అడుగుపెడుతున్నారు. ‘పా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ‘కొత్తలవాడి’ చిత్రాన్ని నిర్మిస్తూ, యువ ప్రతిభకు పట్టం కట్టారు. ఈ చిత్రంలో పృథ్వీ అంబార్ కథానాయకుడిగా నటిస్తుండగా, శ్రీరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
కర్ణాటకలోని కొత్తలవాడి గ్రామంలో ఎక్కువగా చిత్రీకరణ జరిపిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై, మాస్ ఎలిమెంట్స్‌తో సినీ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే అద్భుత స్పందన లభించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ అందాలతో రచ్చ.. బీచ్‌పై టాప్‌లెస్ లుక్‌తో సందడి!
Kothalavadi: మరోవైపు, ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్, ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రంతో బాక్సాఫీస్‌ను కుదిపేయడానికి సిద్ధమవుతున్నారు. యష్ తల్లి నిర్మాతగా, కొడుకు స్టార్ హీరోగా.. ఈ తల్లీకొడుకులు సినీ రంగంలో సందడి చేస్తున్నారు. ‘కొత్తలవాడి’ టీజర్‌తో అంచనాలు రెట్టింపైన సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.