Yash: రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. రామాయణం లో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఆమధ్య ఈ సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ లో కేజీఎఫ్ హీరో యష్ కూడా నటిస్తున్నాడు. యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తాజాగా యష్ రామాయణం షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలను ముంబైలోని అక్సా బీచ్‌లో చిత్రీకరించారని టాక్.
Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్
ఈ సన్నివేశాలను పూర్తి చేసిన తర్వాత, రామాయణ బృందం తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం దహిసర్‌లోని ఒక స్టూడియోకు వెళ్లనుంది. యష్ ఈ సినిమాతో పాటు తన టాక్సిక్ సినిమా షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
టాక్సిక్: బర్త్ డే పీక్ | రాకింగ్ స్టార్ యష్ :