Yamuna Sand Mining

Yamuna Sand Mining: యమునాలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టండి.. సీఎం యోగికి ఢిల్లీ సీఎం లేఖ

Yamuna Sand Mining: ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల సరిహద్దుల్లోని యమునా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

యమునాలో ప్రమాదకర తవ్వకాలు

రేఖా గుప్తా లేఖలో ఏముంది అంటే, యమునా నది వద్ద అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నది గర్భం మారిపోతోందని, నది ఒడ్డున ఉన్న ప్రజలకు ప్రమాదం పెరిగిపోతోందని వివరించారు. ఈ తవ్వకాలు నది కట్టలను బలహీనత చేస్తున్నాయని, వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు.

ఎన్‌జిటి ఆందోళనలు..

ఈ సమస్యపై ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలు పర్యావరణానికి తీరని నష్టం చేస్తోందని, వాటిని వెంటనే ఆపాలని సూచించింది.

సమన్వయంతో పరిష్కారం

ఈ సమస్యకు పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో కూడిన ప్రత్యేక కార్యాచరణ అవసరమని రేఖ గుప్తా స్పష్టం చేశారు. యమునా నది సరిహద్దులను స్పష్టంగా నిర్వచించి ఉమ్మడి చర్యలు చేపట్టాలని కోరారు.

అధికారుల్లో అయోమయం

ఇప్పుడు ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు ఈ సమస్యపై అధికారస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాయి. కానీ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులు సరిగా నిర్ణయించకపోవడం వల్ల కొంత గందరగోళం ఉంది.

యమునా పునరుజ్జీవన ప్రణాళిక

ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే యమునా నదిని శుభ్రపరచేందుకు 43 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో పర్యావరణ ప్రవాహం, మురుగు నీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారు.

మొత్తం విషయం ఏమిటంటే..

ఈ సమస్య అంతర్రాష్ట్రం కావడంతో ఢిల్లీ-యూపీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పర్యావరణం కూడా నాశనం అవుతుంది.. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం మిగులుతుంది.

ఇది కూడా చదవండి:

Crime News: జనగామలో దారుణం: భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు

KTR: అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమే.. కానీ మైక్‌ కట్‌ చేయకుండా ఉంటారా

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *