Mad Square: ఉగాది సందర్భంగా తెలుగు సినీ ప్రియులకు కానుకగా వచ్చిన తాజా చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. సాలిడ్ హైప్‌తో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ సాధించి మేకర్స్ అంచనాలను అందుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్త గ్రాస్ నంబర్స్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఏకంగా 20.8 కోట్ల గ్రాస్‌ను ‘మ్యాడ్ స్క్వేర్’ ఒక్క రోజులోనే రాబట్టినట్లు టీమ్ ప్రకటించింది. ఈ భారీ ఓపెనింగ్‌తో సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ స్పష్టమవుతోంది. రెండో రోజు కలెక్షన్స్ కూడా గట్టిగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. మున్ముందు రోజుల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
A Resounding Welcome and a Grand Celebration at the Box Office 🔥🔥#MadSquare opens with a mind blowing 20.8 Cr+ Worldwide Gross on Day 1 ❤️🔥❤️🔥
This summer, MAD Gang is making a MAXXXX-imum impact 💥💥#BlockBusterMaxxMadSquare 🥳@NarneNithiin #SangeethShobhan #RamNitin… pic.twitter.com/6MCaW9hL6h
— Sithara Entertainments (@SitharaEnts) March 29, 2025