Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలల పనివేళలను రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా మార్చింది. ఈ నెల 16 నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలు నడుస్తుండగా, ఈ నెల 16 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలల సమయాన్ని పొడిగించింది. గతేడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించలేకపోవడంతో ఈ సారి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు టైంటేబుల్ సిద్ధం చేసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆయన ఆదేశించారు.
