Wood Chopping Boards

Wood Chopping Boards: కూరగాయలు కోయడానికి చెక్క బోర్డును ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త..

Wood Chopping Boards: ప్రతి ఒక్కరి వంటగదిలో కూరగాయలు, పండ్లను కోయడానికి కటింగ్ బోర్డులు ఉంటాయి. అయితే, ప్లాస్టిక్ బోర్డులను ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం అనే ఆందోళనల కారణంగా, ఎక్కువ మంది చెక్క బోర్డులను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ బోర్డు వాడటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చెక్క బోర్డులో కట్​ చేసిన ఆహారం నుండి తేమను సులభంగా గ్రహించే రంధ్రాలు ఉంటాయి.

టమోటా రసం, పచ్చి చికెన్ ముక్కలు లేదా అల్లం, వెల్లుల్లి రసాన్ని చెక్క బోర్డు సులభంగా గ్రహిస్తుందని తెలిపారు. ఈ తేమ వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజు గడిచేకొద్దీ చెక్క బోర్డుకు గీతలు పడతాయి. చిన్న పగుళ్లను శుభ్రం చేయడం కొంచెం కష్టం. సరిగ్గా శుభ్రం చేయకపోతే, సాల్మొనెల్లా, లిస్టెరియా వంటి హానికరమైన వ్యాధికారకాలు ఈ చెక్క బోర్డులోని పగుళ్లలో పెరగడం ప్రారంభించవచ్చు. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని కలుషితం చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది.

చెక్క బోర్డు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
ఫ్లూ: సరిగ్గా శుభ్రం చేయని చెక్క కటింగ్ బోర్డుల్లో ఇ.కోలి, సాల్మొనెల్లా వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు పెరగుతాయి. ఈ వ్యాధికారకాలు ఆహారం ద్వారా అనారోగ్యాలకు కారణమవుతాయి. జ్వరం, విరేచనాలు, వాంతులు,వికారం వంటి కడుపు, ప్రేగులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు , వృద్ధులు ఈ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు.

Also Read: Pawan Kalyan: “OG” అన్న సుమ..షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన పవన్

పేగులకు నష్టం:
చెక్క బోర్డుల నుంచి చిన్న చెక్క కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది ప్రేగులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది.

కాలుష్యం:
మనలో చాలా మందికి మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లను ఒకే బోర్డు మీద కోసే అలవాటు ఉంటుంది. ఈ పద్ధతి హానికరమైన సూక్ష్మజీవులను ఒక ఆహారం నుండి మరొక ఆహారంలోకి వెళ్లేలా చేసి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

వీటిని ఉపయోగించండి
వెదురు:
వెదురు కలప పర్యావరణ అనుకూలమైనది. ఇది చాలా కాలం పాటు ఉంటుంది. ఈ వెదురు తక్కువ రంధ్రాలను కలిగి ఉండి తేమను గ్రహించదు. దీంతో బ్యాక్టీరియా పెరగదు.

గాజు లేదా యాక్రిలిక్ బోర్డులు:
గాజు బోర్డులకు రంధ్రాలు ఉండవు. అదనంగా కూరగాయలను కోసిన తర్వాత ఈ బోర్డులను సులభంగా శుభ్రం చేయవచ్చు.

స్టీల్ ప్లాంక్‌లను :
ఇటీవలి కాలంలో స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లాంక్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి చాలా కాలం పాటు ఉంటాయి. దీనికి రంధ్రాలు ఉండవు కాబట్టి శుభ్రం చేయడం సులభం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *