Women’s T20 World Cup 2024 సెమీస్ చేరాలంటే శ్రీలంక జట్టుపై తప్పక గెలవాల్సిందే.. మహిళల టీ20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా పరిస్థితి ఇదీ. కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లు అదిరే ఫెర్ పార్మెన్స్ తో .. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా 82 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై బిగ్ విక్టరీ అందుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్), స్మృతి మంధాన (38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) మెరుపు హాఫ్ సెంచరీలు, బౌలింగ్ లో అరుంధతి, శోభన చెరో 3 వికెట్లు పడగొట్టగా.. రేణుక 2 వికెట్లు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హర్మన్ నిలిచింది.
Women’s T20 World Cup 2024 ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 172 రన్స్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు హర్మన్, మంధాన సూపర్ బ్యాటింగ్ తో భారీ స్కోరు నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్‌కు ఓపెనర్లు షఫాలీ, మంధాన శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 77 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరు జోరుగా బ్యాటింగ్ చేయడంతో పవర్‌ప్లేలో భారత్ 41/0తో నిలిచింది. 13వ ఓవర్‌లో ఆటపట్టు బౌలింగ్‌లో భారత్‌కు గట్టిదెబ్బ తగిలింది. మంధానను రనౌట్ చేసిన ఆటపట్టు.. ఆ తర్వాతి బంతికి షఫాలీని పెవిలియన్ చేర్చింది. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ (16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. చివరి ఓవర్లలో కెప్టెన్ హర్మన్ భారీ షాట్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కౌర్ దెబ్బకు లంక బౌలర్లు చివరి 5 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు చేసింది.
Also Read: బంగ్లాను ఆడేసుకున్న నితీశ్, రింకూ.. రెండో ట్వంటీ20లో టీమిండియా సునాయాస విజయం
మరోవైపు ఛేదనలో ఆసియా ఛాంపియన్స్ శ్రీలంక జట్టు బ్యాటింగ్ లో పూర్తిగా చేతులెత్తేసింది. భారత్ బౌలింగ్ ధాటికి 19.5 ఓవర్లలలో 90 పరుగులకే ఆలౌటైంది.
Women’s T20 World Cup 2024 లంక బ్యాటర్లలో కవిష 21 పరుగులు, అనుష్క 20 పరుగులు చేశారు. వారు మినహా ఎవరూ రాణించలేదు. తొలి ఓవర్ రెండో బంతికి గుణరత్నేను డకౌట్ చేయడంతోపాటు తన రెండో ఓవర్లో 3 రన్స్ చేసిన హర్శితను పెవిలియన్ కు పంపి రేణుక వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టింది. శ్రేయాంక తన రెండో ఓవర్లో చమరి ఆటపట్టును వెనక్కిపంపడంతో 6 పరుగులకే లంక 3 వికెట్లు నష్టపోయింది. ఈ దశలో కవిష, అనుష్క ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, శోభన బౌలింగ్‌లో అనుష్కను రిచా స్టంపౌట్ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 12వ ఓవర్‌లో 8 పరుగులు చేసిన నీలాక్షికను, కవిషను అరుంధతి అవుట్ చేయడంతో.. లంక 6 వికెట్లకు 58 పరుగులతో పరాజయం దిశగా పయనించింది.భారత్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు నష్టపోయి చివరకు 90 పరుగులు మాత్రమే నమోదు చేసి ఓడిపోయింది. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. నెట్ రన్ రేట్లోనూ మెరుగై రెండో స్థానంలో నిలిచింది. హర్మన్ సేన తన చివరి లీగ్ మ్యాచ్లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
