Prabuthava Sarai Dukanam

Prabuthava Sarai Dukanam: ఫిలిం ఛాంబర్ లో “ప్రభుత్వ సారాయి దుకాణం” సినిమాపై మహిళా సమైక్య ఫిర్యాదు

Prabuthava Sarai Dukanam: జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్ పై దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రారన్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. ఇటీవల ఈ చిత్ర టీసర్ విడుదల కావడం జరిగింది. అయితే ఆ టీజర్ లోని డైలాగులు కొంత అసభ్యకరంగా ఉన్నాయంటూ చర్చలు వినిపించాయి.

అలాగే ఈ చిత్ర టీచర్ లో తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ ఆడవారిని అవమానిస్తూ డైలాగులు ఉన్నాయంటూ నేడు కొంతమంది మహిళలు స్పందించడం జరిగింది. తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ గారిని కలిసి మహిళా సమైక్య ప్రతినిధులు కంప్లైంట్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మహిళా సమైక్య ప్రతినిధి దీపా దేవి గారు మాట్లాడుతూ… “ప్రభుత్వ సారాయి దుకాణం అనే చిత్ర టీజర్ లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణలోని మహిళలు ఎంత నీచంగా మాట్లాడుతారా? అంతేకాక ఆడవారితో కూడా అటువంటి బూతులతో కూడిన డైలాగులు చెప్పించారు. భవిష్యత్తును ఎటు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ చిత్రం విడుదలయితే మేము ఊరుకోము, ఖబర్దార్.

దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత ఇటువంటి చిత్రాలు తీయడం అనేది చాలా తప్పు. మహిళలు మీకు అలా కనిపిస్తున్నారా? రాజకీయాలలోని మహిళల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమాను విడుదల కానివ్వము. అవసరమైతే సంసార్ బోర్డును ముట్టడిస్తాం” అన్నారు.

Also Read: Sonam Bajwa: ఇంటిమేట్ సీన్స్‌పై సోనమ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు!

మరొక మహిళ సమైక్య ప్రతినిధి నీరజ గారు మాట్లాడుతూ… “రోజురోజుకు సినిమాలు తీసే విధానం దిగజారిపోతుంది. కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎలా పడితే అలా సినిమా తీస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సారాయి దుకాణం అనే టైటిల్ తో వస్తున్న చిత్రంలో తెలంగాణ యాసను అవమానిస్తున్నారు. ప్రపంచమంతా మన తెలంగాణ అభివృద్ధిని చూస్తుంటే ఇటువంటి నిజమైన భాషతో ఆడవారిని దూషిస్తూ ఇటువంటి సినిమాలు తీయడం, యువతను తప్పుదారి పట్టించేలా ఇటువంటి సినిమాలు తీయడం మంచిది కాదు.

జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఇటువంటి చిత్రాలు చేయడం అనేది సరైనది కాదు. మీ ఇంట్లో ఆడవారు ఇటువంటి బూతులతో కూడిన భాషను ఉపయోగిస్తే మీరు ఊరుకుంటారా? ఈ సినిమాను నిలిపివేయకపోతే దర్శకుడు ఇంటిని ముట్టడిస్తాం. డబ్బు కోసం ఇటువంటి సినిమాలను చేయకండి” అన్నారు.

ధనమ్మ గారు మాట్లాడుతూ… “ఎంతో గౌరవంగా ఎన్నో పండుగలు వ్యవహరించే తెలంగాణ మహిళలను కించపరుస్తూ ఇటువంటి సినిమాలు చేయకండి. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో ఎన్నో బూతులు ఉన్నాయి. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాము. లేదంటే చాంబర్ ను, సెన్సార్ బోర్డును ముట్టడిస్తాము” అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ముఖ్య కార్యదర్శి తమాత్ర ప్రసాద్ గారికి ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ మహిళా సమస్యల ప్రతినిధులు దీపా దేవి, పద్మ, నీరజ, ధనమ్మ, చంద్రమ్మ, నసీమా తదితరులు వినతిపత్రం అందజేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *