Women’s Commission: రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ జూలై 4న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 21న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిరోజ్ ఖాన్ మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, ఫిరోజ్‌ఖాన్‌పై మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
Women’s Commission: ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు మహిళల పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ భావించింది. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన కమిషన్ మహిళలను అవమానించేలా వ్యాఖ్యానించారని తెలిపింది. జూలై 4న విచారణకు హాజరు కావాలని ఫిరోజ్‌ఖాన్‌కు నోటీసులను జారీ చేసింది. ఈ మేరకు ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నది.