ట్రైనర్ యష్టికను జిమ్‌లో బరువులు ఎత్తేలా చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని తివారీ చెప్పారు. ఈ ప్రమాదంలో కోచ్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయంలో కుటుంబం ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. శవపరీక్ష తర్వాత, అథ్లెట్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలై అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ వీడియో చాలా మందిని కలవరపెట్టింది. పవర్ లిఫ్టింగ్ ఒక బలాన్ని ప్రదర్శించే క్రీడ. దీనికి మూడు లిఫ్ట్‌లు ఉంటాయి. అంటే, మూడు లిఫ్ట్‌లలో గరిష్ట బరువును ఎత్తడం. ఈ మూడు లిఫ్ట్ లను స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అంటారు.
ఈ క్రీడ ఒలింపిక్స్‌లో లేదు. క్రీడలలో ప్రమాదాలు అరుదుగా జరిగినప్పటికీ, గతంలోనూ జరిగాయి. 2014లో ఆస్ట్రేలియాలోని ఫిలిప్ హ్యూస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి అతను మరణించడం గమనార్హం.
270kg Rod Falls On Powerlifter’s Neck During Training, 17-Year-Old Gold Medallist Athlete Dies.
(Viewer discretion.) #gym pic.twitter.com/kGn3Y306M4
— QUEEN 👑 (@The_sour_dough) February 19, 2025

