హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో వికారాబాద్ జిల్లాకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు వెరిఫై చేసేందుకు ప్రభుత్వం తరుపున నునావత్ రవి బోరబండ డివిజన్‌కి వచ్చాడు. అయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైట్ వన్ నుంచి సైట్ ఫైవ్, అన్నానగర్ తదితర ప్రాంతాల్లో మొత్తం సుమారుగా 800 అప్లికేషన్లు వెరిఫై చేసే బాధ్యతను ప్రభుత్వం నూనవత్ రవికి అప్పజెప్పింది.

