Shocking News

Shocking News: ఆ రాష్ట్రంలో మద్యం తాగడంలో మహిళలు మగాళ్లతో పోటీ పడుతున్నారు

Shocking News: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో మధ్య నిషేధం విషయంలో మహిళలు పెద్ద ఉద్యమం నడిపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు మద్య నిషేధం కూడా అమలులోకి వచ్చింది. కానీ, తరువాత మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇలా జరిగింది. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు మద్యం తాగుతున్న మహిళలకు సంబంధించి కొత్త లెక్కలు బయటకు వచ్చాయి. ఏ రాష్ట్రంలో మహిళలు మద్యం ఎక్కువ తాగుతున్నారో ఆ లెక్కలు తేల్చేశాయి.

మహిళల్లో మద్యం అలవాటుపై జరిగిన ఒక అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడి అయ్యాయి. ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ రిపోర్టు ప్రకారం ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మద్యం సేవించే మహిళల నిష్పత్తి అత్యధికంగా ఉందని అధ్యయనంలో తేలింది.

ఇది కూడా చదవండి: US Army: ట్రాన్స్ జెండర్స్ పై పగబట్టిన ట్రంప్.. అమెరికా ఆర్మీలో వాళ్లకు స్థానం లేదు..

15-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు మద్యం సేవించే జాతీయ సగటు 1.2%. అస్సాంలో ఈ సంఖ్య 16.5%. భారతదేశంలో ఇది చాలా పెద్ద సంఖ్యగా చెప్పవచ్చు. ఈ జాబితాలో అస్సాం తర్వాత మరో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ఉంది. ఇక్కడ, అదే వయస్సు గల స్త్రీలలో 8.7 శాతం మంది మద్యం తాగుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మద్యం ఎక్కువగా తాగే మహిళల్లో మూడవ స్థానంలో కూడా ఈశాన్య రాష్ట్రమే ఉంది. అవును, అరుణాచల్ ప్రదేశ్‌లో అదే వయసు గల మహిళల్లో మూడు శాతం మంది మద్యం తాగుతారు. మొదటి రెండు రాష్ట్రాలతో పోలిస్తే మూడవ రాష్ట్రంలో మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషం. అయితే, ఈ రాష్ట్రంలో 15-49 సంవత్సరాల వయస్సు కలిగిన పురుషులు దాదాపు 59 శాతం మంది మద్యం తాగుతున్నారు.

ఇక మహిళలు మద్యం సేవించడంలో సిక్కిం , ఛత్తీస్‌గఢ్ వరుసగా 0.3% – 0.2% తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా జార్ఖండ్, త్రిపురలలో వరుసగా 0.3% – 0.8% మహిళలు మద్యం సేవిస్తున్నారు. గతంలో ఈ రాష్ట్రాల్లో మహిళలు అధిక మొత్తంలో మద్యం సేవిస్తున్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి.

అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే పెద్ద నగరాలకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి మెట్రోపాలిటన్ రాష్ట్రాలు ఈ లిస్టులో చివరి స్థానాల్లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *