Women Cricket

Women Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీ

Women Cricket: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత మహిళా జట్టు ఘనంగా బోణీ కొట్టింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ జోరు.. స్పిన్నర్‌ రాధ యాదవ్‌ మాయాజాలంతో గురువారం  జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Women Cricket: ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టులో డెబ్యూ చేసిన తేజల్ హసబ్నిస్ 64 బంతుల్లో 42, దీప్తిశర్మ 51 బంతుల్లో 41, యస్తికా భాటియా 37, జెమీమా 35, షెఫాలి వర్మ 33 పరుగులు చేశారు. కివీస్ బౌలింగ్ లో అమెలియా కెర్ 3 వికెట్లు, జెస్ కెర్ 3 వికెట్లు తీయడంతో భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో న్యూజిలాండ్‌ తడబడింది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ రాధ యాదవ్‌ 3 వికెట్లు, అరంగేట్ర పేసర్‌ సైమా ఠాకోర్‌ 2, దీప్తిశర్మ 1 వికెట్ తో రాణించడంతో కివీస్ బ్యాటర్లు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటై పరాజయం పాలయ్యారు.  రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vizag: స్టీల్ ప్లాంట్ ర‌క్ష‌ణ‌కు మ‌రో ఉద్య‌మం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *