Telangana: పుట్టిన పిల్లలను అల్లారు ముద్గుగా చూసుకుంటుంది తల్లి.. పిల్లల విషయంలో ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు.. అలాంటిది కన్న తల్లి, రెండేళ్ల కూతుర్ని చంపేసింది. ఆపై ఆమె కూడా ఆ్మతహ్య చేసుకుంది.. ఆమెకి ఎలాంటి ఫ్యామిలీ సమస్యలు లేవు.. కాకపోతే ఒక్కటే కారణం. అదేంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా…??
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మహిళ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి.. ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు సంతానం.. ఏమైందో ఏమో కానీ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో లోక సాహితి రెడ్డి తన మూడు సంవత్సరాల కూతురు రితన్య రెడ్డికి ఉరివేసి.. తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.
Also Read: Crime News: మైనర్ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డితో కరీంనగర్ జిల్లా వెధిర గ్రామానికి చెందిన సాహితీకి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు సంతానం.. మృతురాలి భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసిలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
అయితే.. భర్త వేణుగోపాల్ రెడ్డి జగిత్యాలలో తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా.. సాహితి రెడ్డి పెద్దపల్లిలో తాను కిరాయి కుంటున్న ఇంట్లో కూతుర్ని చంపి.. తాను కూడా ఉరివేసుకొని తనువు చాలించింది.