Woman Death: కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపిస్తాయి. కానీ, దాని వెనుక ఉండే విషాదం తెలిస్తే అయ్యో అనిపిస్తుంది. ఇటీవల ఒక భారతీయ మహిళను దుబాయ్ లో హత్యానేరం కింద ఉరితీశారు. ఆమె తండ్రి తన కుమార్తె అంత్యక్రియాలకు వెళ్ళడానికి విదేశాంగశాఖ సహాయం చేయాలనీ కోరుతూ కోర్టుకు వెళ్ళాడు. దీంతో ఈ కథనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషాద కథ తెలుసుకుందాం.
షహజాది ఖాన్ (33) ఉత్తరప్రదేశ్ బందా ప్రాంతానికి చెందిన మహిళ. ఆమెను దుబాయ్ లో ఫిబ్రవరి 15న ఉరితీశారు. నాలుగు నెలల చిన్నారిని హత్య చేసినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను రెండేళ్ల పాటు పాటు దుబాయ్ జైలులో ఉంచారు. నాలుగు నెలల క్రితం కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. దాని ప్రకారం ఆమెను ఉరి తీశారు.
చిన్నతనంలోనే అమ్మేశారు..
షహజాది బందాలోని మాతాంధ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గోయిరా ముగ్లి గ్రామంలో నివసించేది. దుబాయ్ వెళ్ళే ముందు, షహజాది ఖాన్’రోటీ బ్యాంక్’ అనే సామాజిక సంస్థలో పనిచేసేది. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో ఆమె ముఖం ఒక వైపు కాలిపోయింది.
2021 సంవత్సరంలో, ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఆగ్రా నివాసి ఉజైర్‌తో పరిచయం ఏర్పడింది. ఉజైర్ అబద్ధాలు చెప్పి షహజాది ఖాన్ ని తన వలలో వేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Paytm: రూల్స్ పాటించని పేటీఎం.. ₹ 611 కోట్లకు నోటీసులు పంపించిన ఈడీ
Woman Death: ఉజైర్ షహజాది ఖాన్ ముఖానికి చికిత్స చేయిస్తానని చెప్పి ఆగ్రాకు పిలిపించాడు. దీని తరువాత, చికిత్స పేరుతో, ఆమెను 2021 నవంబర్‌లో దుబాయ్‌లో నివసిస్తున్న ఫైజ్, నదియా అనే దంపతులకు అమ్మేశాడు. అప్పటి నుంచి ఆమె దుబాయ్ లో ఉంటోంది. తాను అబద్ధం చెప్పి దుబాయ్ వెళ్లానని షహజాది ఇంతకు ముందు చెప్పింది. ఆమెను కొనుగోలు చేసిన ఫైజ్ – నదియా నిత్యం వేధించేవారు. వాళ్ళు ఆమెను ఇంట్లోనే బంధించేవారు. వాళ్ళు ఆమెను ఎప్పుడూ బయటకు వెళ్ళనివ్వలేదు. ఎప్పుడు కొడుతూ ఉండేవారు. ఆమె చాలాసార్లు భారతదేశానికి తిరిగి రావాలని అనుకుంది. కానీ ఆ దంపతులు ఆమెను వదల్లేదు. ఫైజ్ -నదియా దంపతులకు 4 నెలల కుమారుడు ఉన్నాడు.ఆ చిన్నారి చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఈ క్రమంలో బాలుడు మరణించాడు. దీనికి ఫైజ్-నదియా షహజాది కారణమని ఆరోపించారు. ఆమెపై పోలీసు కేసు నమోదు అయింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి దుబాయ్ జైలులో ఉంచారు. ఇటీవల కోర్టు తీర్పు రావడంతో ఉరి తీశారు.
దుబాయ్ వెళ్ళడానికి సహాయం చేయండి..
Woman Death: షహజాది ఖాన్ కుటుంబం అంత్యక్రియల కోసం అబుదాబికి ప్రయాణించడంలో మంత్రిత్వ శాఖ, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం సహాయం చేస్తాయి. రెండు రోజుల క్రితం, షహజాది ఖాన్ తండ్రి ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, ఫిబ్రవరి 14న తన కుమార్తె తనకు ఫోన్ చేసి జైలు నుండి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పిందన్నారు. ఆమెను ఉరి తీయనున్నట్టు అప్పుడే చెప్పినట్టు షహజాది తండ్రి పేర్కొన్నారు. అబుదాబి చట్టం ప్రకారం షహజాది ఖాన్ కి క్షమాభిక్ష కోసం సహకరించాలని అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ కూడా రాశాననీ.. కానీ, దానికి సమాధానం రాలేదని.. ఈలోపు తన కుమార్తెను ఉరి తీసేశారని షహజాది ఖాన్ తండ్రి తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఈ పిటిషన్ పై వచ్చిన నోటీసులకు రాయబార కార్యాలయం కోర్టుకు సమాధానం ఇచ్చింది.
యుఎఇలోని భారత రాయబార కార్యాలయానికి యుఎఇ ప్రభుత్వం నుండి ఈ సమాచారం ఫిబ్రవరి 28, 2025న అందింది. ఈ సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ మార్చి 3న ఢిల్లీ హైకోర్టుకు అందించింది. షహజాది ఖాన్ అంత్యక్రియలు మార్చి 5న జరుగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది.

