Maharashtra

Maharashtra: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని పిల్లల ముందే ఈ మహిళ భర్తను ఏమి చేసిందో తెలిస్తే ఛీ..ఛీ.. అంటారు

Maharashtra: మానవీయత అక్రమ సంబంధాల నీచత్వంలో మంటగలిసిపోతోంది. విచ్చలవిడితనం పెరిగిపోవడమో.. మతి భ్రమించి చేస్తారో తెలియదు కానీ, ఇటీవల కాలంలో వివాహం జరిగాకా అక్రమ సంబంధాలకు తెరతీసి.. ఆనక తన జీవిత భాగస్వామిని కడతేర్చడం జరుగుతూ వస్తోంది. అలాంటిదే అసంఘటన సంచలనం కలిగించింది.

వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపి అడవిలో పడేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆ మహిళ – ఆమె స్నేహితుడు కలిసి ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డారు. అంతేకాదు, ఈ సంఘటన పిల్లల ముందే జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో, హత్యకు గురైన వ్యక్తిని బలవంతంగా మోటార్ సైకిల్ వెనుక కూర్చోబెట్టి, మోటార్ సైకిల్ పై చంపేసినట్లు చూపించే సీసీటీవీ ఫుటేజ్ విడుదలైంది.
భర్త హత్య

ఈ సంఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మాల్వాణి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “హత్యకు గురైన రాజాచవన్ ఒక కోళ్ల వ్యాపారి. 30 ఏళ్ల ఈ వ్యక్తి తన భార్య పూజ (28), వారి 10 ఏళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి మలాడ్ వెస్ట్‌లోని మాల్వాన్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా పూజ ఇమ్రాన్ మన్సూరి అనే 26 ఏళ్ల యువకుడితో స్నేహం చేసింది. ఈ స్నేహం ఇద్దరి మధ్య మరింత సన్నిహిత బంధాన్ని ఏర్పరచింది. తమ అక్రమ సంబంధం బయటపడడంతో పూజ తన ప్రియుడు ఇమ్రాన్ తో కలిసి భర్తను హతమార్చింది. ఆ తరువాత పూజ, ఆమె ప్రియుడు ఒకరికి ఒకరు దూరంగా ఉన్నట్లు నటించడం మొదలు పెట్టారు. తరువాత పూజ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Road Accident: కార్మికులను తీసుకెళ్తున్న లోడర్ బోల్తా.. మహిళ మృతి, 16 మందికి గాయాలు

పట్టించిన CCTV ఫుటేజ్
పూజ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడు పూజ చర్యలపై పోలీసులకు అనుమానం వచ్చింది.

వారి ఇంటి ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినప్పుడు, మన్సూర్ బైక్ నడుపుతున్నట్లు కనిపించింది. ఆ బైక్ పై పూజ వెనుక కూర్చుని, ఆమె భర్త మధ్యలో కూర్చుని ఉన్న దృశ్యాలు పోలీసులకు చిక్కాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు బలమైన అనుమానాలను రేకెత్తించింది. తమ స్టైల్ లో దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో షాకింగ్ వెల్లడయ్యాయి. పూజకు, మన్సూర్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని.. వారు ఇద్దరూ కలిసి ఆమె భర్తను చంపేశారని వెల్లడైంది.
కత్తితో తల నరికి..

సంఘటన జరిగిన రోజున, పూజ ఇంట్లోని వంటగది కత్తితో రాజేష్‌ను పొడిచి చంపింది. అంతకు ముందు తన భర్త రాజేష్‌కు పెద్ద మొత్తంలో మద్యం తాగించింది. ఆ తరువాత మద్యం మత్తులో అతను స్పృహ కోల్పోయినప్పుడు, అతని గొంతు కోశారు. ఆ సమయంలో పూజ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.

ఆ తర్వాత వారు రాజేష్ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి సమీపంలోని చిత్తడి అడవిలో పడేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

వివాహేతర సంబంధం కారణంగా భర్తను హత్య చేసినందుకు పూజ, మన్సోర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *