Sunitha: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇప్పటికీ న్యాయం అందలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
వివేకా హత్య జరిగి ఆరేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ మాకు న్యాయం జరుగలేదు. సీబీఐ కోర్టులో ట్రయల్ ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప, మిగతావారంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాను. అయితే, దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు అడ్డుకుంటున్నారని అనుమానం కలుగుతోంది.
ఇది కూడా చదవండి: Starlink Satellite Internet: ఎలోన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ కు కేంద్రం షరతులు
సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. సాక్షుల వాంగ్మూలాలను వెనక్కి తీసుకునేలా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. అందుకే, ఈ కేసును నిర్బంధంగా విచారించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను’’ అని సునీత అన్నారు.