Parliament Sessions: 18వ లోక్‌సభ తొలి శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ డిసెంబర్ 20 వరకు కొనసాగుతుందితాయి. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లు సహా పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.ఇది కాకుండా, జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించే ప్రతిపాదనను కూడా ఆమోదించవచ్చు.
18వ లోక్‌సభ తొలి వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరిగాయి. మొత్తం సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరిగాయి. ఇది సుమారు 115 గంటల పాటు కొనసాగింది. సెషన్‌లో సభ ప్రొడక్టివిటీ 136%గా ఉంది. అదే సెషన్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సభలో ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి: Air Pollution: ఢిల్లీ కాలుష్యం.. దిగజారుతున్న ప్రజల ఆరోగ్యం
Parliament Sessions: మొత్తం 27 గంటల 19 నిమిషాల పాటు జరిగిన చర్చలో 181 మంది సభ్యులు పాల్గొన్నారు. సెషన్‌లో మొత్తం 65 ప్రైవేట్ మెంబర్ బిల్లులను కూడా ప్రవేశపెట్టారు.
ఇది కాకుండా, ఈ సెషన్‌లో దేశంలోని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, ప్రాణ, ఆస్తి నష్టంపై కూడా చర్చించామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఒలింపిక్స్‌కు భారత్ చేస్తున్న సన్నాహాలపైనా వర్షాకాల సమావేశాల్లో చర్చించారు.