Wines Close:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల (ఏప్రిల్) 6న హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తోపాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ యాజమాన్యాలు ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
Wines Close:నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కమిషనరేట్ పేర్కొన్నది. ఈ ఆదేశాలను విధిగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్‌శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 7న ఉదయమే మళ్లీ వైన్స్ దుకాణాలు తెరుచుకోనున్నాయి.