Wine shop: గుడ్ న్యూస్.. అర్దరాత్రి 12 గంటల దాకా వైన్స్ ఓపెన్..

Wine shop: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్‌ 31న బార్లు, క్లబ్‌లు, ప్రత్యేక ఈవెంట్‌లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే రోజు వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది.

అయితే నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనుమతించిన సమయాలను మించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *