Kane Williamson: వెస్టిండీస్‌తో డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టుకు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగి వచ్చాడు. అతడిని తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో చేర్చారు. గతంలో జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న విలియమ్సన్, టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి ఇటీవలే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
విలియమ్సన్ తిరిగి రావడంపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ సంతోషం వ్యక్తం చేశారు. “కేన్ సామర్థ్యం అద్భుతమైనది. టెస్ట్ గ్రూప్‌లో అతని నైపుణ్యాలు, నాయకత్వం తిరిగి రావడం గొప్ప విషయం” అని అన్నారు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ కూడా జట్టులోకి వచ్చాడు.
ఇది కూడా చదవండి: Movie Piracy: ఐబొమ్మ ని ఆపితే పైరసీ ఆగదు.. సినిమా రిలీజ్ అయిన వెంటనే సైట్ లోకి
అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్లు కైల్ జేమీసన్, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఈ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. పేస్ దళంలో జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, బ్లెయిర్ టిక్నర్ వంటి కొత్త ముఖాలకు చోటు లభించింది.ఈ సిరీస్ న్యూజిలాండ్‌కు 2025-2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చక్రంలో మొదటి సిరీస్ కానుంది. ఈ టెస్టు సిరీస్‌కు టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

