Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ జోడీగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీలు పదే పదే వాయిదా పడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. జూన్ 12న రాబోతుందనుకుంటే, మళ్లీ కొత్త అడ్డంకులు తలెత్తాయని తాజా టాక్. గతంలో ఈ చిత్రం రిలీజ్ డేట్స్ వల్ల ఇతర సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయినా, ఈసారి ఇతర చిత్రాలు వెనక్కి తగ్గే అవకాశం లేదని, పవన్ సినిమానే పోటీ లేని కొత్త తేదీని ఎంచుకోవాల్సి ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ హైప్‌తో అభిమానుల్లో ఉత్కంఠ రేగుతోంది. మరి, ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.
