Nani: హాయ్ నాన్న సినిమాతో అదరగొట్టిన దర్శకుడు శౌర్యువ్ తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. గత ఏడాదిన్నరగా కొత్త చిత్రం ప్రకటించని శౌర్యువ్, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని భావించాడట. ఇద్దరి మధ్య కథపై చర్చలు జరిగినా, తారక్ షెడ్యూల్ రెండేళ్లపాటు ఖాళీ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడినట్టు సమాచారం.
దీంతో శౌర్యువ్ మరోసారి నానితో జతకట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త చిత్రం యాక్షన్ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, హాయ్ నాన్నలోని భావోద్వేగాలకు భిన్నంగా కొత్త కథాంశంతో శౌర్యువ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Also Read: Siva Karthikeyan: క్రేజీ డైరెక్టర్ తో శివకార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్!
Nani: ప్రస్తుతం నాని తన రాబోయే చిత్రం ది ప్యారడైజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. జూలై నుంచి ఈ చిత్రం షూటింగ్ వేగవంతం కానుంది. దీని నిర్మాణానికి సుమారు పది నెలల సమయం పట్టవచ్చని, దీంతో మార్చి 2026 విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. శౌర్యువ్-నాని కొత్త చిత్రం వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.