Cucumber

Cucumber: దోసకాయలు తింటే ఆ వ్యాధి వస్తుందా..?

Cucumber: దోసకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కానీ అమెరికాలో చాలా మంది ఈ దోసకాయ తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. అమెరికాలో సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇది దోసకాయల ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు. అందుకే ఆ దేశం దోసకాయల అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. కలుషితమైన ఆహారం తిన్న 12 నుంచి 72 గంటల్లోపు సాల్మొనెల్లా బ్యాక్టీరియా అనారోగ్యానికి కారణమవుతుందని అమెరికా ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పులు వస్తాయని చెబుతున్నారు. ఏప్రిల్ 29 – మే 19 మధ్యకాలంలో ఈ తెగులు సోకిన దోసకాయలు ఎక్కువగా అమ్ముడయ్యాయని.. దాంతో ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించిందని సమాచారం.

ఇప్పటివరకు అమెరికాలోని 15 రాష్ట్రాల్లో 26 మంది ఈ వ్యాధితో అనారోగ్యానికి గురయ్యారు. తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఫ్లోరిడాలోని బెడ్నార్ గ్రోవర్స్‌లో పండించిన దోసకాయలను ఫ్రెష్ స్టార్ట్ ప్రొడ్యూస్ సేల్స్, రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు మరియు ఇతర అవుట్‌లెట్‌లకు విక్రయించారని దర్యాప్తులో తేలింది. చాలా మంది దోసకాయలను తిన్నారని CDC తెలిపింది.

ఇది కూడా చదవండి: Health Tips: స్నానం చేసిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తుందా? అయితే జాగ్రత్త

గత నెలలో దోసకాయ తోటలో తనిఖీలు చేపట్టినప్పుడు సాల్మొనెల్లా నిర్ధారణ అయిందని FDA తెలిపింది. ప్రజలు కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా లేదా జంతువు వల్ల సాల్మొనెల్లా బారిన పడవచ్చు. అయితే ఇండియాలో మాత్రం ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదం లేదు. కానీ తగిన జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దోసకాయలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి :

దోసకాయ తీసుకున్న తర్వాత, దానిని బాగా కడిగి తినాలి.

అది కొంచెం చెడిపోయినా, తినొద్దు.

దోసకాయను వేడి నీటితో శుభ్రంగా కడిగి తినాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *