Viral News: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో భార్య తన భర్తను దెయ్యం పట్టినట్లు నటించి దారుణంగా దాడి చేసిన ఘటన పెద్ద కలకలం రేపుతోంది.
ఘటన వివరాలు
పెనుబల్లి మండలం జంగాల కాలనీలో నివసించే గంగారం (51), లక్ష్మి దంపతులు. వీరిద్దరూ 35 ఏళ్లుగా కలిసి నివాసం ఉంటున్నారు. అయితే గంగారం మద్యం అలవాటు వల్ల తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఎన్నిసార్లు చెప్పినా మారని భర్తపై లక్ష్మి విచిత్రంగా ప్రణాళిక వేసింది.
దెయ్యం పట్టినట్టు నటించి భర్తను చితక్కొట్టిన భార్య
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పంచాయితీలోని జంగాల కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల గంగారాం తన భార్య లక్ష్మి చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. మద్యానికి బానిసైన గంగారాంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.… pic.twitter.com/E46QhZID6N
— ChotaNews App (@ChotaNewsApp) August 25, 2025
రెండు రోజుల క్రితం తనకు దెయ్యం పట్టిందంటూ లక్ష్మి పెద్దగా కేకలు వేస్తూ భర్తపై ఒక్కసారిగా దాడి చేసింది. గంగారం నోటిలో గుడ్డలు కుక్కి, కర్రతో, ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టింది. తీవ్ర గాయాలతో బయటకు పరుగెత్తిన గంగారాన్ని బంధువులు హాస్పిటల్‌కు తరలించారు. దాడిలో ఆయనకు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటన అనంతరం గంగారం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కావాలనే భార్య తనపై దాడి చేసిందని, చిత్రహింసలకు గురి చేసిందని పేర్కొన్నాడు. నోట్లో గుడ్డలు కుక్కి, కర్రలతో కొట్టి, గాయపరిచిందని వివరించాడు. బంధువులు ప్రశ్నించగా కూడా లక్ష్మి “నాకు దెయ్యం పట్టింది” అంటూ వింతగా ప్రవర్తించిందని సమాచారం.
కేసు నమోదు
వీ.ఎం. బంజర్ పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.