Health Risks

Health Risks: అన్నం తినేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు..?

Health Risks: మనం తినేటప్పుడు మన నోటిలోని లాలాజలం ఆహారంతో కలిసిపోయి దానిని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అయితే మనం తినేటప్పుడు మాట్లాడితే, ఆహారంతో పాటు గాలి కూడా మన కడుపులోకి వెళుతుంది. దీనివల్ల మన జీర్ణ ప్రక్రియలో సమస్యలు వస్తాయి. చాలా మందికి భోజనం చేసేటప్పుడు మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే తినేటప్పుడు మాట్లాడితే.. మీరు తినే ఆహారం మీ గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. అందుకే పెద్దలు నెమ్మదిగా తినాలని, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతారు.

Also Read: Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?

Health Risks: అదనంగా, మీరు తినేటప్పుడు మాట్లాడితే, మీ నోటిలోని చిన్న ఆహార కణాలు, బ్యాక్టీరియా ఇతరులపై పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం, పరిశుభ్రత కారణాల దృష్ట్యా, తినేటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. మీరు మాట్లాడుతూ తింటే మీ దృష్టి ఆహారం మీద కాకుండా వేరే చోట ఉంటుంది. దీనివల్ల ఆహార రుచిని ఆస్వాదించడం అసాధ్యం అవుతుంది. సంతృప్తికరంగా తినడం కూడా అసాధ్యం అవుతుంది. కాబట్టి తినేటప్పుడు, మీరు తినే ఆహారంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలి. సంప్రదాయాల ప్రకారం మనం రోజూ తినే ఆహారాన్ని దేవుని నైవేద్యంగా పరిగణిస్తారు. భోజనం చేస్తూ మాట్లాడటం దేవుడిని అవమానించినట్లేనని..కాబట్టి భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని పెద్దలు చెప్తారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *