Firing At Golden Temple Premises

Firing At Golden Temple Premises: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న నేత

Firing At Golden Temple Premises: ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అక్కడ పెద్ద మీటింగ్ . పెద్ద మనుషులు అందరు వచ్చారు. సడన్ గా గన్ సౌండ్. ఆ మీటింగ్ కు వచ్చిన ఓ వ్యక్తి చేతిలో తుపాకీ. కాల్చి పారిపోవాలి అనుకున్నాడు. కానీ పెట్టేసుకున్నారు. ఇంతకీ ఎందుకు కాల్చినట్లు. తెలుస్తుంది త్వరలో….

పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వెలుపల సుఖ్‌బీర్ బాదల్ గార్డుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా దూసుకువచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బాదల్ మతపరమైన శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ ఉండగా, ఆ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. అయితే, అక్కడున్న వ్యక్తులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ కాల్పుల ఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది.

Firing At Golden Temple Premises: కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దాల్ ఖల్సా కార్యకర్త నారాయణ్ సింగ్ చౌరా అనే వ్యక్తి సుఖ్‌బీర్‌పై పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసేందుకు అతను తన ప్యాంట్‌లోని పిస్టల్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు, ఒక వ్యక్తి అతనిపై దాడి చేసి పట్టుకున్నాడు. దీంతో బుల్లెట్ అకాలీదళ్ నాయకుడికి తగిలింది. నిందితుడు ఖలిస్తాన్‌ మద్దతుదారుగా అనుమానిస్తున్నారు. ఆత్మ త్యాగం కేసుల విషయంలో సుఖ్‌బీర్ బాదల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత రెండు రోజులుగా స్వర్ణ దేవాలయం వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అదును చూసి దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌కు ఇటీవల “అకల్ తఖ్త్‌” సంస్థ మతపరమైన శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. అక్కడ సేవాదార్‌గా సేవలు చేస్తున్నారు. వంటపాత్రలు శుభ్రం చేయాలని, చెప్పులు తుడవాలని “అకల్ తఖ్త్‌ ” ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఆ శిక్షను పాటిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన స్వర్ణ దేవాలయానికి వెళ్లారు.. ఇవాళ రెండో రోజు సేవ కోసం వెళ్లిన టైమ్‌లో ఆయనపై కాల్పులకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

Firing At Golden Temple Premises: “అకల్‌ తఖ్త్‌ ” అనేది సిక్కుల అత్యున్నత సంస్థ.. ఆ సంస్థ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలా స్వర్ణ దేవాలయంలో పనిచేయాలని ఆదేశించింది. పలు సిక్కు ఆలయాల్లో కూడా క్లీనింగ్ చేయాలని అకల్‌ తఖ్త్‌ ఆదేశించింది. దానికోసమే ఆయన గోల్డెన్ టెంపుల్‌కి వచ్చారు. 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌రహీమ్‌కు మేలు చేసేలా సుఖ్‌బిర్‌ వ్యవహరించారని అకల్ తఖ్త్‌ ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు శిక్ష వేసింది. ఆ శిక్షలో భాగంగా ఇవాళ రెండో రోజు స్వర్ణ దేవాలయానికి వెళ్లినప్పుడు ఆయనపై కాల్పులకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *