IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-6 భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ పేర్లు ఉన్నాయి. కానీ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత ఓపెనర్ కేఎల్ రాహుల్. అవును.. రాహుల్ 174 సిక్సర్లతో ఈ రికార్డును కలిగి ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 171 సిక్సర్లు బాదాడు. కెఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టడానికి అతనికి కేవలం నాలుగు సిక్సర్లు మాత్రమే అవసరం.
కోహ్లీ త్వరలోనే ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది. కోహ్లీ నిలకడ, దూకుడు ఆట శైలిని బట్టి ఈ రికార్డును బద్దలు కొడతాడు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ జాబితాలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ధావన్ 143 సిక్సర్లు కొట్టాడు. తనదైన ఆటతీరుతో అభిమానులను అలరించిన ధావన్.. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇక ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. ‘హిట్‌మ్యాన్’ గా పేరుగాంచిన రోహిత్ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 135 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ దూకుడు ఆటతీరు, పెద్ద షాట్లు సులభంగా కొట్టగల సామర్థ్యం అతన్ని ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా నిలిపాయి.
ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: తల్లి త్యాగం… తండ్రి కృషి.. నా విజయాలన్నింటికీ నా తల్లిదండ్రులే కారణం..!
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి రోహిత్ నాలుగు లేదా ఐదు సంవత్సరాలు మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు కాబట్టి, ఓపెనర్‌గా అతని సిక్సర్ల సంఖ్య తక్కువగా ఉంది. కానీ మొత్తం మీద సిక్సర్లు జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ తొలినాళ్లలో విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 104 సిక్సర్లతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. 2015లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సెహ్వాగ్, తన సిక్సర్లతో ఐపీఎల్ చరిత్రలో శాశ్వత ముద్ర వేశాడు. గుజరాత్ టైటాన్స్ యువ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా గిల్ 100 సిక్సర్లు కొట్టాడు, ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల ఇన్నింగ్స్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. మొత్తం మీద, ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ పేరిట ఉంది. KKR, RCB, పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు గేల్ 357 సిక్సర్లు కొట్టాడు. అతని రికార్డును బద్దలు కొట్టడం ప్రస్తుతానికి సుదూర కల అనే చెప్పాలి.

