Hyderabad:హైదరాబాద్ మహానగరంలో మరో చిరుత భయం పట్టుకున్నది. కొన్నాళ్ల క్రితం శంషాబాద్ సమీపంలో పులి సంచారం వార్త సంచలనం సృష్టించి సమీప ప్రాంతాల్లో భయాందోళన కలిగిచింది. ఇదే కోవలో శుక్రవారం రాత్రి మియాపూర్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో చిరుత సంచారం స్థానికుల కంటపడింది.
Hyderabad:చెట్ల సమీపంలో సంచరిస్తున్న చిరుత పులిని చూసిన స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతున్నది. ఇంతకూ ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది? ఎటు వైపు వెళ్లింది? అంటూ స్థానికులు కంటిమీద కునుకులేకుండా జాగారం చేశారు. చిరుత సంచారం విషయాల్లో స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుత సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.