Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం “అఖండ 2 తాండవం”. ఈ డైనమిక్ జోడి నాలుగో సినిమాగా, మొదటి సీక్వెల్‌గా రూపొందుతూ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతుండగా, ఈ చిత్రం దసరా రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే, రిలీజ్ డేట్‌పై కొంత గందరగోళం నెలకొంది. కొందరు ఈ రేసులో సినిమా రాకపోవచ్చని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అసలు క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ దాదాపు ఖరారైంది.
Also Read: Mass Jatara: ఇద్దరు యంగ్ హీరోయిన్లతో మాస్ రాజా రొమాన్స్?
Akhanda 2: ఈ టీజర్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. పాత తేదీనా, కొత్త తేదీనా అనేది టీజర్‌లోనే బయటపడనుంది. అఖండ 2 హైప్‌ను మరింత పెంచేలా ఈ టీజర్ అదిరిపోనుందని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు!