Jayasudha: నటన అంటేనే ‘అసహజం’ – అందులోనూ సహజ నటన అంటే ఎలా ఉంటుందో చూపించారు జయసుధ. అందుకే జనం ఆమెను ‘సహజనటి’ అంటూ కీర్తించారు. తెలుగు చిత్రసీమలో జయసుధ టాప్ స్టార్స్ తో పాటు అప్ కమింగ్ హీరోస్ తోనూ నటించారు. తన కంటే చిన్నవయసువారితోనూ జోడీ కట్టి అలరించారు. ఏది చేసినా వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగారు.
ఇది కూడా చదవండి: Unstoppable: అన్ స్టాపబుల్ లో ఆ ఇద్దరూ
Jayasudha: జయసుధ అభినయానికి నాలుగుసార్లు నంది నడచుకుంటూ ఆమెతో వెళ్లింది. ఇక ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ లోనూ జయసుధకు ప్రత్యేక స్థానం లభించింది. నటిగానే కాదు నిర్మాతగానూ జయసుధ తన అభిరుచిని చాటుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు 2009లో సికిందరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.ఆ తరువాత పలు పార్టీలు మారిన జయసుధ నటిగా మాత్రం తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 17న జయసుధ పుట్టినరోజు. ఈ బర్త్ డే తరువాత జయసుధ ఏ తీరున సాగుతారో చూడాలి.