Sabarimala Temple 18 Steps

Sabarimala Temple 18 Steps: శబరిమల లోని 18 మెట్లకు ఉన్న విశిష్టత ఏంటి?

Sabarimala Temple 18 Steps: పవిత్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్లకు (పదునెట్టాంబడి) అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మెట్లను కేవలం 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టి, ‘ఇరుముడి’ ధరించిన భక్తులు మాత్రమే ఎక్కడానికి అర్హులు. సాధారణ భక్తులకు ఈ బంగారు మెట్లపైకి ప్రవేశం ఉండదు. 18 మెట్లు భక్తుడి ఆత్మయాత్రలో ఉండే వివిధ దశలను, మానవ జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తాయని పండితులు, భక్తులు విశ్వసిస్తారు.

తొలి 5 మెట్లు: ఇవి పంచేంద్రియాలు (కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శ) లకు ప్రతీక. ఈ ఇంద్రియాలపై అదుపు సాధించడం తొలి మెట్టుగా భావిస్తారు.
తరువాతి 8 మెట్లు: ఇవి అష్ట రాగాలను (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభం) సూచిస్తాయి. ఈ అష్ట రాగాలను వదిలి, అహంకారాన్ని జయించాలని ఇవి బోధిస్తాయి.
తరువాతి 3 మెట్లు: ఇవి త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలు) సంకేతం.
చివరి 2 మెట్లు: ఇవి విద్య, అవిద్య లను సూచిస్తాయి.

ఇది కూడా చదవండి: Raju Weds Rambai: రాజు వెడ్స్‌ రాంబాయి ఫ్రీ షో…కానీ

ఈ 18 మెట్లు అయ్యప్పస్వామి దుష్ట శక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలు అని కూడా కొందరు చెబుతారు. స్వామి కొలువుదీరే సందర్భంలో 18 వాయిద్యాలు మోగించారని అంటారు. ఆలయానికి చేరుకునే మార్గంలో దాటాల్సిన 18 కొండలకు ఇవి ప్రతీక అని కూడా ప్రచారంలో ఉంది.ప్రతి మెట్టుపై ఒక అధిష్టాన దేవత కొలువై ఉంటుందని, ఈ మెట్లను ఎక్కిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడితో ఈ మెట్లను ఎక్కడం ద్వారా, తమలోని అహంకారాన్ని, చెడు గుణాలను తొలగించుకొని, జ్ఞాన మార్గంలో నడవాలని ఈ 18 మెట్లు సందేశాన్ని ఇస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *